Friday, September 30, 2022
Home వార్తలు Allagadda Politics: ఆళ్లగడ్డ లో గ్రాఫ్ మారుతోంది .. "భూమా" కు కొత్త నాయకత్వం!?

Allagadda Politics: ఆళ్లగడ్డ లో గ్రాఫ్ మారుతోంది .. “భూమా” కు కొత్త నాయకత్వం!?

- Advertisement -

Allagadda Politics: రాష్ట్రంలో రాజకీయ గాలి మొదలైంది. ఆ గాలి వేడి పుట్టించి ఆ వేడి సెగ నాయకులకు తగులుతోంది. ఆ సెగకు రెండు పార్టీలకు చెమటలు పడుతున్నాయి. ఆ చెమటల్లో రకరకాల వరాలు, హామీలు, కొత్త కొత్త మాటలు పుట్టుకొస్తున్నాయి. మొత్తానికి జనాలకు తెలియకుండాానే సైలెంట్ గా ఒక పొలిటికల్ సెలైన్ ను మూడు పార్టీలు రాష్ట్రంలో రగిల్చేశాయి. ఈ క్రమంలోనే కొన్ని నియోజకవర్గాలపై రాష్ట్ర రాజకీయ అభిమానుల చూపు మళ్లింది. అక్కడ ఎవరు పోటీ చేస్తారు..? అక్కడ ఎవరిపై ఎవరు పట్టు సాధిస్తారు..? అక్కడ ఎవరి గాలి బాగా వీస్తుంది.? అంటూ తమలో తామే ప్రశ్నలు వేసుకుని దొరికిన చోటల్లా సందేహాలు తీర్చుకుంటారు. కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ నియోజకవర్గం కూడా ఈ కోవలోకే వస్తుంది !. ఈ నియోజకవర్గంలో దాదాపుగా మూడు దశాబ్దాల క్రిందట భూమా వేసుకున్న బ్రాండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ బ్రాండ్ ను ఎవరు కొనసాగిస్తారు..? వచ్చే ఎన్నికల్లో ఈ బ్రాండ్ ను ఎవరు ఉపయోగించుకుంటారు..? అనేదే అతి పెద్ద ప్రశ్న! దానికి సమాధానం ఏమిటో ఒక సారి చూద్దాం.

భూమా బ్రాండ్ కొనసాగించేది ఎవరు..?

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా పొలిటికల్ బ్రాండ్ ! 1989 నుండి కొనసాగుతోంది. మొదటి సారిగా భూమా శేఖర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే అయ్యారు. అక్కడ నుండి నియోజకవర్గంలో ఒక చెరగని ముద్ర వేయగలిగారు. 1994లో నాగిరెడ్డి హావా మొదలు కొని ఆయన ఆయన భార్య శోభానాగిరెడ్డి ఇద్దరూ కూడా సుదీర్ఘకాలం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పొలిటికల్ తిష్ట వేయగలిగారు. వారు దివంగతులు అయ్యాక అఖిలప్రియ కు టీడీపీ అండగా నిలవడంతో తల్లి వారసురాలిగా ఎమ్మెల్యే అయ్యారు. తండ్రి సెంటిమెంట్ తో మంత్రి పదవి కొట్టారు. తండ్రి కూడా మరణించిన తరువాత ఆ భూమా బ్రాండ్ కు ఏకైక వారసురాలిగా ఆమెనే వెలిగారు. ఓ వైపు మంత్రి పదవి, అధికార హోదా, బ్రాండ్ అన్నీ కలిసి రావడంతో అఖిలప్రియ అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర స్థాయి నాయకురాలిగా ఎదిగిపోయారు. కానీ మేడిపండు చందంగానే ఆమె పేరు, ఆ బ్రాండ్ రాష్ట్రం అంతా ఒకలా ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంలో మాత్రం మేడిపండు లోపల ఉన్నట్లుగానే నియోజకవర్గంలో పరిస్థితి ఉంది. అఖిలప్రియ అసలు రాజకీయం ఏమిటి..? అఖిలప్రియ చేసిన తప్పులు ఏమిటి..?అఖిలప్రియ ఏ విధంగా ఆ బ్రాండ్ ను పొగొట్టుకున్నారా.? లేదా నిలబెట్టారా..? అనే విషయాన్ని కాసేపు పక్కన బెడదాం..! ఇప్పుడు అసలు వచ్చే ఎన్నికల్లో ఈ భూమా బ్రాండ్ ను కొనసాగించేది ఎవరు..? అనేది మాత్రమే ఒక సారి చూడాల్సిన అవసరం ఉంది !. ఎందుకంటే..? అఖిలప్రియకు ఉన్నపళంగా టీడీపీ సీటు ఇవ్వడం లేదని ఎవరు అనుకోరు! కానీ.. ఆమెకు సీటు ఇచ్చే విషయంలో ఎక్కడో కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి. దానికి కారణం ఇదే భూమా ఫ్యామిలీ నుండి భూమా కిషోర్ రెడ్డి అనే నాయకత్వం ఆళ్లగడ్డ తక్కువ సమయంలో వెలుగొందుతోంది. మొదట శేఖర్ రెడ్డి, ఆ తరువాత నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి, వాళ్ల తరువాత ఆ స్థాయిలో కాస్త పేరు ప్రఖ్యాతులు పొందే విషయంలో భూమా కిషోర్ రెడ్డి పోటీ పడుతున్నారు. శ్రమిస్తున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తిష్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సో.. ఇప్పుడు కిషోర్ రెడ్డి బీజేపిలో ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత చరిష్మానే బాగా పెంచుకున్నారు. ఇప్పుడు ఆయన వేయబోయే పొలిటికల్ అడుగులే చర్చనీయాంశంగా మారాయి.

టీడీపీ చూపు కిషోర్ వైపు..? అఖిల వైపా..?

- Advertisement -

వచ్చే ఎన్నికలు టీడీపీ చావో రేవో తేల్చుకోవాల్సిన ఎన్నికలు. కశ్చితంగా అధికారంలోకి వచ్చి తీరాల్సిన ఎన్నికలు. అందుకే ఏ ఒక్క సీటు అభ్యర్ధి ఎంపిక విషయంలో కూడా చంద్రబాబు కాంప్రిమైజ్ అవ్వడం లేదు. అచి చూసి జల్లెడ పట్టి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రకరకాల నివేదికలు తెప్పించుకుని తన రాజకీయ పరిజ్ఞానాన్ని, పరిపక్వతను, పరిణితిని ఉపయోగించి కసరత్తు చేస్తున్నారు. అందుకే ఆళ్లగడ్డ విషయంలో కూడా ఈ ప్రక్రియ మొత్తం చేసే పనిలో ఉన్నారు. సో.. అఖిలప్రియను వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధిగా కొనసాగించాలా ..? లేదా అనే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏమీ తేల్చుకోలేకపోతున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అఖిలప్రియ పట్ల సొంత పార్టీలోనే కొంత వ్యతిరేకత ఉందట! ఆమె మంత్రిగా ఉన్నప్పుడు పార్టీని కాస్త బలోపేతం చేసి తన చరిష్మాను బలోపేతం చేసుకుని తనకంటూ ఒక కేడర్ ను సృష్టించుకోకుండా తండ్రిలా మాస్ ఇమేజ్ సంపాదించుకోకుండా కేవలం మంత్రి హోదాను అనుభవిస్తూ పైపై నామమాత్రపు రాజకీయం మాత్రమే చేయగలిగారు. బహుశా తన తెలియని తనమో..! చిన్న వయసులోనే కష్టపడకుండా మంత్రి పదవి రావడమో.! కారణాలు ఏమైనా కావచ్చు.! అఖిలప్రియ భూమా బ్రాండ్ ను కొనసాగించలేకపోయారు. పైగా టీడీపీ అధినేత నమ్మకాన్ని పొందలేకపోయారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో 2019 ఎన్నికల తరువాత భూమా కిషోర్ రెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. తనకు అంటూ ఒక గొడుగు ఉండాలి కాబట్టి బీజేపీలో చేరి రాజకీయ ప్రవేశం చేసినప్పటికీ తను పల్లెబాట పేరిట వ్యక్తిగత కార్యక్రమాలే చేస్తున్నారు. బీజేపీ జెండాను పక్కన బెట్టి తన వ్యక్తిగత చరిష్మాను పెంచుకునే ప్రయత్నంలో తన కు అంటూ వ్యక్తిగత ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో చాలాా వరకు సక్సెస్ అయ్యారట కూడా.! అందుకే భూమా ఫ్యామిలీలో ప్రస్తుతం ఉన్న ఈ ఇద్దరు వారసుల్లో వ్యక్తిగత చరిష్మా విషయంలో, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పట్టు విషయంలో అఖిలప్రియ కంటే కిషోర్ రెడ్డే కాస్త మెరుగు అని చంద్రబాబు భావిస్తున్నారుట.! అయితే ఇక్కడ ఒక చిక్కొచ్చి పడింది. ఎంతైనా రాష్ట్రం మొత్తం భూమా అంటే అందరికీ గుర్తుకు వచ్చేది నాగిరెడ్డి మాత్రమే. శోభానాగిరెడ్డి మాత్రమే. సో . వీళ్లద్దరి ముద్దుల తనయ అఖిలప్రియను కాదు అని భూమా నాగిరెడ్డి అన్న కొడుకు అయిన కిషోర్ రెడ్డి ఆ భూమా బ్రాండ్ కు వారసుడుగా చంద్రబాబు తీసుకువచ్చే సాహసం చేస్తారో..? లేదో అనేది అనుమానమే.! నిజంగా అది చేస్తే మాత్రం సాహసమే అవుతుంది. ఆ సాహసం సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. సో.. అర్ధం అయ్యింది కదా..! వ్యక్తిగత చరిష్మా, రాజకీయ పట్టు పెంచుకున్న కిషోర్ రెడ్డికి టీడీపీ నుండి త్వరలోనే చల్లని కబురు అందుతుంది అని ప్రచారం అయితే జరుగుతోంది. మరో వైపు దీన్ని అడ్డుకునే ప్రయత్నాలు కూడా అఖిలప్రియ వర్గం నుండి జరుగుతున్నాయట.! సో.. వీళ్లద్దరిలో తక్కెడ ఎటువైపు తూగుతుంది..? అనేది చంద్రబాబు మనసుకే తెలియాలి..!

- Advertisement -
RELATED ARTICLES

Kandukuru TDP: పెద్దల ఆలోచనల్లో మార్పు!? ఇంఛార్జి కుర్చీ..!?

Kandukuru TDP: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త క్లిష్టంగా, కష్టంగా మారిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..! వరుస వివాదాలు, వర్గాలు, విభేదాల కారణంగా పార్టీలో ఉన్న బలాన్ని కూడా...

Breaking: సుప్రీం కోర్టు చెంతకు చేరిన ఏపి మూడు రాజధానుల అంశం

Breaking: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఏపి హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేయాలన్న కృత నిశ్చయంతోనే ఉంది. వచ్చే ఏడాది నుండే విశాఖలో పరిపాలనా...

Most Popular

Kandukuru TDP: పెద్దల ఆలోచనల్లో మార్పు!? ఇంఛార్జి కుర్చీ..!?

Kandukuru TDP: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త క్లిష్టంగా, కష్టంగా మారిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..! వరుస వివాదాలు, వర్గాలు, విభేదాల కారణంగా పార్టీలో ఉన్న బలాన్ని కూడా...

Breaking: సుప్రీం కోర్టు చెంతకు చేరిన ఏపి మూడు రాజధానుల అంశం

Breaking: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఏపి హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేయాలన్న కృత నిశ్చయంతోనే ఉంది. వచ్చే ఏడాది నుండే విశాఖలో పరిపాలనా...

లిక్కర్ స్కామ్ లో మాగుంట ఇరుక్కున్నట్లేనా..!? చిక్కుల్లో ఒంగోలు ఎంపీ.. కానీ ట్విస్ట్ ఉంది

మన దేశ రాజకీయాలను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుదిపేస్తొంది అన్నది అందరికీ తెలుసు. కొన్ని రోజులుగా ఏపి రాజకీయాలను కూడా లిక్కర్ స్కామ్ కుదిపేసింది. ఢిల్లీలో మొదలైన లిక్కర్ స్కామ్...