Friday, September 30, 2022
Home వార్తలు MLA Gottipati: ఓటరు లిస్ట్ పై అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే గొట్టిపాటి

MLA Gottipati: ఓటరు లిస్ట్ పై అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే గొట్టిపాటి

- Advertisement -

MLA Gottipati: అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పుట్టవారిపాలెంలోని తన అతిథి గృహం నందు సంతమాగులూరు మండల టీడీపీ కార్యకర్తలు, నేతలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో మంగళవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయాలు, రాష్ట్రంలోని పరిస్థితుల పై సమీక్ష జరిపిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఎన్నికలకు సిద్దమయ్యేలా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో అబద్దపు హామీలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ సారి టీడీపీ అనుకూల ఓట్లను తొలగించే అవకాశం ఉందనీ, కావున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటరు లిస్టులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తతతో వ్యవహరించాలని చెప్పారు. అదే విధంగా పార్టీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని సూచించారు. సభ్యత్వ నమోదు చేయడం వల్ల వారికి ఇన్సూరెన్స్ రక్షణ ఉంటుందని చెప్పారు. కార్యకర్తలపై ఏమైనా ప్రమాదం జరిగితే వెంటనే సమాచారం పార్టీ దృష్టికి తీసుకురావాలన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. వైసీపీ పాలనతో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. ప్రజా సమస్యపై గ్రామస్థాయిలో పోరాటాలు చేయాలని సూచించారు.  

రైతుల సమస్యలు,నిత్యావసర ధరల పెరుగుదల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ పథకాలలో కోత,  గ్రామాల్లో పాఠశాలల మూసివేత తదితర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజలకు వివరించి క్షేత్ర స్థాయి పోరాటాలు చెయ్యాలని ఎమ్మెల్యే రవికుమార్ వివరించారు ఇదే క్రమంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించాలని చెప్పారు. గత టీడీపీ హయాంలో అమలు చేసిన దళితుల 27 పథకాలు జగన్ సర్కార్ రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దళితులు, గిరిజనులు ఓట్ల తో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళకే శఠగోపం పెట్టారని విమర్శించారు. టీడీపీ హయాంలో అంబేడ్కర్ విదేశీ విద్య పధకం ద్వారా ఎస్సీ విద్యార్థులను విదేశాలు పంపి చదివించడం జరిగిందన్నారు. ఇప్పుడు ఆ పథకానికి పేరు మార్చి అనేక ఆంక్షలు పెట్టి పేద వాళ్లకు విదేశీ విద్యను దూరం చేశారని విమర్శించారు. ముస్లిం మైనార్టీలలో ఆడపిల్లల పెళ్లిల్లు తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతోనే టీడీపీ హయాంలో దుల్హన్ పథకాన్ని చంద్రబాబు ప్రవేశపెడితే జగన్ సర్కార్ పథకాన్ని మూడేళ్లుగా నిలిపివేశారనీ, ఆ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో ఇప్పుడు పథకానికి పేరు మార్చి అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

- Advertisement -

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దుల్హన్ పథకంతో పాటు ఇతర కులాలకు సంబంధించిన కళ్యాణలక్ష్మీ (చంద్రన్న పెళ్లి కానుక) ను నిలిపివేశారన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో లక్షా ఇరవై వేల పెళ్లిల్లు జరుగుతున్నాయనీ వాళ్లంతా మూడేళ్లుగా ప్రభుత్వం నుండి ప్రోత్సాహక నగదు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేద వర్గాల నుండి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని అధికారంలోకి వచ్చి మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఆ పథకాన్ని తిరిగి తీసుకువస్తున్నారని చెప్పారు. ఈ పథకాన్ని తీసుకువస్తూనే పేదల్లోని కొందరికి ఈ పథకం వర్తించకుండా పలు ఆంక్షలు పెట్టారని విమర్శించారు. ఈ పథకం కింద లబ్ధిపొందాలంటే పదవ తరగతి ఖచ్చితంగా చదవాలన్న నిబంధన పెట్టారన్నారు. అదే విధంగా మూడు వందల యూనిట్లు విద్యుత్ వాడకం దాటితే అర్హత లేని వారిగా పేర్కొన్నారన్నారు. ఇలా అనేక నిబంధనలు పెట్టారని ఆరోపించారు రవికుమార్. పథకం అమలు చేయాలన్న తపన ఉంటే ఈ రకమైన నిబంధనలు పెడతారా అని ప్రశ్నించారు. బూటకపు జీవోలు తీసుకువచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. బాదుడే బాదుడు చేస్తున్న జగన్‌రెడ్డిని తిరిగి బాది క్విట్‌ జగన్‌ సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, బ్రింగ్‌ బాబు నినాదంతో చంద్రబాబును తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రవికుమార్ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Kandukuru TDP: పెద్దల ఆలోచనల్లో మార్పు!? ఇంఛార్జి కుర్చీ..!?

Kandukuru TDP: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త క్లిష్టంగా, కష్టంగా మారిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..! వరుస వివాదాలు, వర్గాలు, విభేదాల కారణంగా పార్టీలో ఉన్న బలాన్ని కూడా...

Breaking: సుప్రీం కోర్టు చెంతకు చేరిన ఏపి మూడు రాజధానుల అంశం

Breaking: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఏపి హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేయాలన్న కృత నిశ్చయంతోనే ఉంది. వచ్చే ఏడాది నుండే విశాఖలో పరిపాలనా...

Most Popular

Kandukuru TDP: పెద్దల ఆలోచనల్లో మార్పు!? ఇంఛార్జి కుర్చీ..!?

Kandukuru TDP: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త క్లిష్టంగా, కష్టంగా మారిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..! వరుస వివాదాలు, వర్గాలు, విభేదాల కారణంగా పార్టీలో ఉన్న బలాన్ని కూడా...

Breaking: సుప్రీం కోర్టు చెంతకు చేరిన ఏపి మూడు రాజధానుల అంశం

Breaking: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఏపి హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేయాలన్న కృత నిశ్చయంతోనే ఉంది. వచ్చే ఏడాది నుండే విశాఖలో పరిపాలనా...

లిక్కర్ స్కామ్ లో మాగుంట ఇరుక్కున్నట్లేనా..!? చిక్కుల్లో ఒంగోలు ఎంపీ.. కానీ ట్విస్ట్ ఉంది

మన దేశ రాజకీయాలను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుదిపేస్తొంది అన్నది అందరికీ తెలుసు. కొన్ని రోజులుగా ఏపి రాజకీయాలను కూడా లిక్కర్ స్కామ్ కుదిపేసింది. ఢిల్లీలో మొదలైన లిక్కర్ స్కామ్...