Sunday, July 3, 2022
Home విశ్లేషణ YSRCP Cabinet: జిల్లా నుండి ముగ్గురు మధ్య తీవ్ర పోటీ..! రెడ్డి, వైశ్య, కాపు -...

YSRCP Cabinet: జిల్లా నుండి ముగ్గురు మధ్య తీవ్ర పోటీ..! రెడ్డి, వైశ్య, కాపు – రూ.కోట్ల ఆఫర్ కూడా..!?

- Advertisement -


YSRCP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మార్పులకు రంగం సిద్ధం అవుతోంది. దసరా, దీపావళి మధ్యలోనే మంత్రివర్గ మార్పులు చేర్పులు ఉంటాయనేది వైసీపీ అంతర్గత వర్గాల సమాచారం. అయితే సంక్రాంతి నాటికైతే పక్కా. ఇంకా రెండు నెలలు మాత్రమే ప్రస్తుత మంత్రులకు గడువు ఉంది. ఇప్పటికే మంత్రివర్గంలోకి ఎవరెవరు రాబోతున్నారు, ఉన్న వాళ్లు ఎవరెవరు పోతారు అనే అంతర్గత చర్చలు మొదలు అయ్యాయి. అందుతున్న సమాచారం మేరకు ఏపి కేబినెట్ మొత్తం ప్రక్షాళన చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న మంత్రులందరినీ పంపించేసి కొత్త మంత్రులతో కొత్త కేబినెట్ ఏర్పాటు చేయాలన్నది సీఎం జగన్మోహనరెడ్డి ఆలోచన. తొలుత ముగ్గురు నలుగు మంత్రులను ఉంచి ఇతర మంత్రులను తొలగించాలని భావించారుట. అయితే దీని వల్ల మంత్రులుగా కొనసాగుతున్న వారిలో సంతోషం ఉంటే, మంత్రిపదువులు పోగొట్టుకున్న వారిలో బాధ ఉంటుంది. దానికి తోడు మంత్రి పదవులు పొగొట్టుకున్న వాళ్లు తాము చేసిన తప్పు ఏమిటి, మంత్రి వర్గంలో కొనసాగుతున్న వాళ్లు చేసిన మంచి ఏమిటి అని మధనపడుతుంటారు. అదే అందరినీ తొలగిస్తే సీఎం జగన్ సిద్ధాంతం, పార్టీ విధానం అది అందరితో పాటు తమకు మంత్రి పదవి పోయిందని ఎవరికి వారు సర్ది చెప్పుకుంటారు. ఇలా చేస్తే ఎటువంటి పొరపొచ్చాలు ఉండవు. మంత్రి వర్గం నుండి తొలగించిన వారిలో కొందరికి పార్టీలో మంచి పదవులు, లేక ప్రభుత్వంలో మంచి పదవులు ఇస్తారు. మరి కొందరికి ఏ పదవులు ఇవ్వకుండానే పక్కన పెట్టేస్తారు.

YSRCP Cabinet: ఈ ముగ్గురిలో ఒకరికి కేబినెట్ తో బెర్త్ ఖాయం

అయితే కొత్తగా రానున్న మంత్రులకు ఒక్కో జిల్లాలో ఒక్కో తరహా రాజకీయం కనబడుతోంది. రాష్ట్రంలోని ఒ కీలక జిల్లాలో ఆర్యవైశ్య నుండి ఒక ఎమ్మెల్యే పోటీ పడుతున్నారు. కాపు సామాజిక వర్గం నుండి ఒక ఎమ్మెల్యే, అలానే రెడ్డి సామాజిక వర్గం నుండి ఓ సీనియర్ ఎమ్మెల్యే పోటీ పడుతున్నారు. వీరి ముగ్గురిలో ఎవరికి మంత్రి పదవి ఇస్తారు అనేది ఆ జిల్లాలో వైేసీపీ వర్గాల్లో చాలా హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ప్రకాశం జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో ఓ విభిన్నమైన చరిత్ర ఉన్న జిల్లా. ఈ జిల్లాలో ప్రస్తుతం ఇద్దరు మంత్రులు ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి.. సీఎం జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితులు, దగ్గరి బంధువు కూడా. జగన్ కు మామయ్య అవుతారు. అలాగే ఆదిమూలపు సురేష్ ఉన్న మంత్రుల్లో అత్యున్నత విద్యావంతుడు. ఐఆర్ఎస్ అధికారి. వీళ్లు ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. ఒకరు రెడ్డి సామాజివర్గం కాగా మరొకరు ఎస్సీ సామాజిక వర్గంకు చెందిన వారు. వీళ్లు ఇద్దరూ కూడా దాదాపు మంత్రివర్గం నుండి బయటకు వచ్చేసినట్లే. వీళ్లకు తరువాత పార్టీలో మంచి పొజిషన్ దక్కే అవకాశం ఉంది. అయితే కొత్తగా ఆ జిల్లా నుండి ఎవరిని కేబినెట్ లోకి తీసుకుంటారు అనేదే పెద్ద చర్చ. ఎవరికి తోచినట్లుగా వారు చెప్తున్నారు. వాస్తవానికి ముగ్గురు ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. అందులో రెడ్డి సామాజికవర్గం నుండి మానుగుంట మహీదర్ రెడ్డి. ఈయన కాంగ్రెస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పని చేశారు. నాల్గవ సారి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత. జిల్లా రాజకీయాలపై మంచి పట్టు ఉంది. ముక్కు సూటిగా వ్యవహరించే మనిషి, అవినీతి ఆరోపణలు కూడా పెద్దగా లేవు కాబట్టి ఆయనకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. లేదా ఆర్యవైశ్య సామాజికవర్గం నుండి వైసీపీలో ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నారు. ఆయన స్థానంలో ఆయన వెళ్లిపోతే అదే సామాజిక వర్గానికి చెందిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు ఛాన్స్ ఇస్తారు అని పుకారు నడుస్తోంది. ఇది కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఆయనకు ఆర్యవైశ్య సామాజికవర్గం ఒక ప్లస్ పాయింట్ అయితే మరొకటి ఏమిటంటే ఎన్నికల్లో జగన్మోహనరెడ్డి తరువాత అత్యంత మెజార్టీతో అంటే సుమారు 81వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు. ఆయనకు కూడా ఆర్యవైశ్య సామాజికవర్గ కోటా లో అవకాశం ఉంది. ఆర్యవైశ్య సామాజికవర్గం నుండి మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

అనూహ్యంగా తెరపైకి మద్దిశెట్టి పేరు

- Advertisement -

వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు అన్నా రాంబాబు, విజయనగరం జిల్లా కోలగట్ల వీరభద్రరావు ఉన్నారు. ఇక కాపు సామాజికవర్గం నుండి మద్దిశెట్టి వేణుగోపాల్ మంత్రిపదవిని ఆశిస్తున్నారు. ఇక్కడే ఓ కీలకమైన స్ట్రాటజీ ఉంది. వాస్తవానికి మద్దిశెట్టి వేణుగోపాల్ కు మంత్రి పదవి ఇస్తారని మొదట ప్రచారంలో లేదు. ఇప్పుడు అనుహ్యంగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజికవర్గం యాక్టివ్ అవుతోంది. వైసీపీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్, వంగవీటి రాధా కృష్ణ లు కాపులందరినీ ఏకం చేసే పనిలో పడ్డారు. ఇప్పుడు వైసీపీలోని కాపు సామాజికవర్గం యాక్టివ్ కావాలంటే సరైన వ్యక్తికి మంత్రిపదవి ఇచ్చి మొత్తం సామాజికవర్గాన్ని నడిపించే వ్యక్తి కావాలనేది వైసీపీలో ఒ అంతర్గత ఆలోచన. మద్దిశెట్టి వేణుగోపాల్ అయితే విద్యావంతుడు. ఆర్ధికంగా కాస్త స్థితిమంతుడు. అందరినీ కలుపుకోని వెళ్లగలడు. అయితే స్థానికంగా దర్శి నియోజకవర్గంలో ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ, అంతర్గత విభేదాలు, వివాదాలు ఉన్నాయి. ఈ తరుణంలో అవన్నీ పక్కన బెట్టి ఆయనకు మంత్రిపదవి ఇస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. రెడ్డి, కాపు, ఆర్యవైశ్య కమ్యూనిటీలలో ఒకరికి మాత్రమే ప్రకాశం జిల్లా నుండి అవకాశం దక్కుతుంది. అన్నా రాంబాబుకే అవకాశాలు ఎక్కువ అన్న మాట వినబడుతుంది. ఎందుకంటే మహీదర్ రెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. బాలినేనిని తొలగించి మహీదర్ రెడ్డికి అవకాశం కల్పించడానికి ఆయన అంగీకరించకపోవచ్చు. దానికి తోడు మహీదర్ రెడ్డి ప్రస్తుతం అలిగి ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏమిటంటే సామాజిక సమీకరణాల్లో మంత్రి పదవి ఆశిస్తున్న ఓ ఎమ్మెల్యే మంత్రిపదవి ఇస్తే పార్టీ ఫండ్ కింద భారీ గా పార్టీ ఫండ్ ఇస్తానని ఆఫర్ చేసినట్లు వార్తలు వినబడుతున్నాయి. చూడాలి ఎవరికి మంత్రిపదవి దక్కుతుందో.

- Advertisement -
RELATED ARTICLES

Balineni Srinivasa Reddy: బాలినేని పై కుట్రలు ఎవరెవరి పని..!? ప్రకాశం వైసీపీలో శత్రువుల.. !?

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. తన పార్టీలోనే తనకు శత్రువులు ఉన్నారనీ, తనపైన...

Addanki Politics: అద్దంకిలో ఎవరికి ఎవరు శత్రువు..!? కొత్త వ్యూహంతో కృష్ణ చైతన్య..!

Addanki Politics: కరణం వర్గానికి - గొట్టిపాటి, బాచిన రెండు వర్గాలతో శత్రుత్వం ఉంది. కుటుంబ పరమైన ఫ్యాక్షన్ తగాదాలు ఉన్నప్పటికీ 2019 ఎన్నికల్లో గొట్టిపాటికి చేసారు. ఇప్పుడు కరణం...

Darsi Elections: “దర్శి”లో గెలుపెవరిది..!? ఎవరికీ ఎన్ని వార్డులు..!?

Darsi Elections: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది.. జిల్లాలోని దర్శి నగర పంచాయతీలో ఎన్నికలు ముగిసాయి.. దాదాపు 78 శాతం పోలింగ్...

Most Popular

Ongole YSRCP: ఈదర మోహన్ అడుగులు ఎటు..!? బాలినేనితో వార్ ప్లానింగ్స్?

Ongole YSRCP: ఈదర మోహన్ జిల్లాలో సుపరిచిత నేత.. భిన్న భావాలున్న రాజకీయాలు చేస్తూ ఒకరకంగా ఎవ్వరికీ తల ఒంచే రకం కాదు.. అందుకే ఏ పార్టీలో నిలవలేకపోతున్నారు..! టీడీపీ...

AP High Court: కేసు పెడితే వెంటనే అరెస్టు చేయవద్దు

AP High Court: వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు హైకోర్టులో  బిగ్ రిలీఫ్ దొరికినట్లు అయ్యింది. రఘురామ దాఖలు చేసిన లంచ్ మోహన్ పిటిషన్...

AP High Court: ఏపి ప్రభుత్వ ఆన్‌లైన్ సినిమా టెకెటింగ్‌కి హైకోర్టు బ్రేక్

AP High Court: ఏపిలో జూన్ 2వ తేదీ నుండి ఏపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా ఆన్ లైన్ సినిమా టికెట్ల...

Breaking: సత్యసాయి జిల్లాలో ఘోర విషాదం – 5 గురు సజీవ దహనం

Breaking: సత్యసాయి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ కారణంగా 5 మంది వ్యవసాయ కూలీలు సజీవ దహనం అయ్యారు. తాడిమర్రి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. వసాయ...