Friday, April 19, 2024
Home వార్తలు ప్రకాశం జిల్లాలో వైసీపీని ముంచింది ఇదే ..! బావ - బావ మరుదుల గ్యాప్ పెద్దదా..?

ప్రకాశం జిల్లాలో వైసీపీని ముంచింది ఇదే ..! బావ – బావ మరుదుల గ్యాప్ పెద్దదా..?

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చురుగ్గా, బలంగా ఉన్న జిల్లా ఏదైనా ఉంది అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లానే. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ కూడా అంగీకరిస్తుంది. అందుకే అక్కడ మహానాడు కూడా నిర్వహించారు. ఆ జిల్లాలోని నాయకులు అందరూ ఐక్యంగా పని చేస్తున్నారు కాబట్టే ఆ జిల్లాలో పార్టీ గతంతో పోలిస్తే బలపడిందని చంద్రబాబు అనేకే సందర్భాల్లో చెప్పారు. ఆ జిల్లాలో వైసీపీ నాయకులు కూడా అంతరంగంగా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. ఎందుకు ఈ జిల్లాలో టీడీపీ బలపడుతుంతోంది..? అక్కడ టీడీపీ బలపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కారణమా..? ఆ పార్టీలో ఉన్న రెండు గ్రూపులే కారణమా..? సీఎం జగన్మోహనరెడ్డి కూడా ఈ గ్రూపులను పరిష్కరించ లేక, వారి ఇద్దరిని ఏమీ చేయలేక అచేతనావస్థలో ఉండిపోయారా..? అనే విషయాలను పరిశీలిస్తే..

2019 వరకూ జిల్లాలో క్యాడర్ కు అండగా వైవీ

ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్ద దిక్కు. 2012లో సీఎం జగన్మోహనరెడ్డి కోసం మంత్రి పదవిని ఒదులుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. పార్టీ కోసం పని చేశారు. ఆ తర్వాత 2014లో ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయారు. 2014 వరకూ జగన్మోహనరెడ్డి జైలులో ఉన్నప్పుడు పార్టీకి తెరవెనుక, తెర ముందు ఉండి నడిపించింది, వ్యవహారాలు చూసుకుంది వైవీ సుబ్బారెడ్డి. 2014 లో ఎంపీగా ఎన్నికైన వైవీ సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లాలో 2019 వరకూ పార్టీని నడిపించారు. పోషించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి నియోజకవర్గానికి, జిల్లాకు అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్న సమయంలోనూ వైవీ సుబ్బారెడ్డే ప్రకాశం జిల్లా సమస్యలను పదేపదే పార్లమెంట్ లో ప్రస్తావించడంతో పాటు పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కేంద్ర బృందాలను జిల్లాకు తీసుకురావడంతో పాటు ప్రతిపక్షంగా నాడు అధికార పక్షాన్ని గట్టిగా ఢీకొన్నారు.

Granite YSRCP: Internal Issue with Granite

వైవీ సుబ్బారెడ్డి VS బాలినేని శ్రీనివాసరెడ్డి

- Advertisement -

2019 ఎన్నికలు వచ్చే సరికి వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య బాగా గ్యాప్ వచ్చింది. వైవీ సుబ్బారెడ్డికి లోక్ సభ టికెట్ ఇవ్వకపోవడానికి బాలినేని శ్రీనివాసరెడ్డే కారణమన్న ప్రచారం జరిగింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చి లోక్ సభ టికెట్ ఇవ్వడానికి బాలినేని శ్రీనివాసరెడ్డే కారణమని పార్టీలో టాక్ నడిచింది. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఈ ఇద్దరు జగన్మోహనరెడ్డికి దగ్గరి బంధువులు కావడంతో ఇబ్బంది ఏమీ లేదు, పరిష్కరించుకుంటారని అనుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి అయ్యారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యారు. అయితే ఈ మూడున్నర సంవత్సరాల్లో వైవీ సుబ్బారెడ్డి మూడు నాలుగు సార్లు మాత్రమే జిల్లాకు వెెళ్లారు. సంవత్సరానికి ఒకటి రెండు సార్లు కూడా సొంత జిల్లాకు వెళ్లలేని పరిస్థితిలో వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.

అన్ని నియోజకవర్గాల్లో రెండు గ్రూపులు

- Advertisement -

ఇదే సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉంటూ చక్రం తిప్పారు. ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. దర్శిలో రెండు గ్రూపులు మద్దిశెట్టి, బూచేపల్లి వర్గాలు ఉన్నాయి. కనిగిరిలో రెండు గ్రూపులు ఉన్నాయి. ఎమ్మెల్యేకి అనుకూల, వ్యతిరేక (రెడ్డి సామాజికవర్గం) గ్రూపు ఉన్నాయి. అదే విధంగా గిద్దలూరులో ఎమ్మెల్యే గ్రూపు, వ్యతిరేక గ్రూపులు. మార్కాపురంలో మూడు గ్రూపులు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గ్రూపులతో పాటు మరో గ్రూపు ఉంది. ఎర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ కు అనుకూల గ్రుపు, వ్యతిరేక గ్రూపు, సంతనూతలపాడు, చీరాల, పర్చూరు, అద్దంకి. ఇలా ఏ నియోజకవర్గంలో చూసినా వైసీపీలో రెండు గ్రూపులు ఉన్నాయి. వీళ్లకు ఏ అవసరం వచ్చినా ఒక వర్గం వాళ్లు బాలినేని శ్రీనివాసరెడ్డి వద్దకు మరో వర్గం వైవీ సుబ్బారెడ్డి వద్దకు వెళ్లే వాళ్లు. అద్దంకిలో ఒక సీఐ పోస్టింగ్, దర్శిలో ఒక ఫ్లెక్సీ గొడవ, కనిగిరిలో ఒక చిన్న నీటి ప్రాజెక్టు కాంట్రాక్ట్, సింగరాయకొండలో ఒక చిన్న పోస్టింగ్ ఇలా చిన్న విషయాలను ఇద్దరూ ప్రెస్టేజీగా తీసుకుని వివాదాలు చేసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే ఈ విషయాల్లో మంత్రి బాలినేనిదే పై చేయి అయ్యింది.

టీటీడీ ఆధ్వర్యంలో బాలినేని జరిపిన శ్రీనివాస కళ్యాణానికి వైవీ గైర్హజరు

- Advertisement -

రీసెంట్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి శ్రీనివాస కల్యాణం నిర్వహించారు. చాలా ఘనంగా, వైభవోపేతంగా చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి దంపతులు, బాలినేని ప్రణీత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. చాలా మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం టీటీడీ ఆధ్వర్యంలో జరిగింది. టీటీడీ ప్రొటోకాల్ ప్రకారం అన్ని జరిగాయి. కానీ టీడీపీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాత్రం ఎందుకు హజరు కాలేదు..? బాలినేనికి వైవీ బావ బావమరుదులు. దగ్గరి బంధువు నిర్వహించే శ్రీనివాస కళ్యాణంలోనూ వైవీ పాల్గొనలేదు అంటే వీరి మధ్య గ్యాప్ ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు ! రాజకీయపరంగా గ్యాప్ ఉండటమే కాక కుటుంబ పరంగానూ మనస్పర్ధలు ఉన్నట్లు సమాచారం.

రాజకీయపరంగా కొందరి మద్య గ్యాప్ లు ఉంటాయి. ఆ కోవలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు ఉన్నారు. వీళ్ల మద్య రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ కుటుంబ పరంగా ఫంక్షన్ లలో కలుస్తుంటారు. ప్రతిష్టాత్మంగా నిర్వహించిన శ్రీనివాస కళ్యాణంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ హోదాలో అయినా పాల్గొనవచ్చు లేక బంధువుగా అయినా పాల్గొనవచ్చు. కానీ ఏ రకంగానూ ఆయన హజరుకాలేదు. వాళ్లిద్దరి మధ్య విభేదాలకు ఇది సాక్షంగా నిలుస్తొంది. వీళ్ల మద్య గ్యాప్ కారణంగానే జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో రెండు గ్రూపులు ఉన్నాయి. భవిష్యత్తులోనూ వీళ్ల మధ్య రాజీ కుదిరే పరిస్థితులు కనిపించడం లేదు. సీఎం వైఎస్ జగన్ సొంత బాబాయ్ అయి ఉండి టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్నా సొంత జిల్లాకు వెళ్లలేని దారణ పరిస్థితి.

ఒంగోలు ఎంపీ స్థానానికి టీడీపీ బలమైన అభ్యర్ధి..?

తను ఎంపిగా ఉన్న సమయంలో తన కోసం పని చేసిన కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేకపోయారు. ఆయన వర్గం వాళ్లకు ఏమైనా అవసరం ఉంటే వైవీని కలిసేందుకు తాడేపల్లి వెళ్లాల్సిన పరిస్థితి. నెల రోజుల్లో రెండు రోజులు కూడా ఒంగోలులో ఉండలేని పరిస్థితి. ముందరి కాళ్లకు బంధం వేశారు. ఈ కారణంగానే వాళ్ల మద్య రాజీ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ పర్యవసానాల నేపథ్యంలో చాపకింద నీరుగా టీడీపీ జిల్లాలో బలపడుతోంది. ఒంగోలు ఎంపీ స్థానానికి కూడా అంగ బలం, అర్ధబలం పుష్కలంగా ఉన్న నేతను టీడీపీ పట్టుకుంది. ఆయన పోటీ చేస్తే ఆ జిల్లాలో మాగుంట వైసీపీ తరపున పోటీ చేస్తే వైవీ సుబ్బారెడ్డి వర్గం పార్టీకి చేసే అవకాశం ఉండదనే మాట వినబడుతోంది. ఒక వేళ పార్టీ కోసం వైవీ వర్గం మాగుంటకు చేస్తే బాలినేని వర్గం వ్యతిరేకంగా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బాలినేని, వైవీ మద్య గ్యాప్ ను సీఎం జగన్మోహనరెడ్డి కూడా పరిష్కరించలేనంతగా ఉంది అని మాత్రం పేర్కొనవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

ప్రజాతీర్పు కోరుతుంటే….వైకాపాలో వణుకు పుడుతుంది : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.కానీ ఇప్పటివరకు నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని వివేక కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం...

జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి కేసులో నిందితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని...

ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం : వైయస్ షర్మిల

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు.అనంతపురం...

Most Popular

ప్రజాతీర్పు కోరుతుంటే….వైకాపాలో వణుకు పుడుతుంది : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.కానీ ఇప్పటివరకు నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని వివేక కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం...

జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి కేసులో నిందితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని...

ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం : వైయస్ షర్మిల

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు.అనంతపురం...

హిందూ భక్తుల మనోభావాలపై వైకాపా గొడ్డలి పోట్లు : చంద్రబాబు

రాష్ట్ర ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏక్స్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీరామనవమి అనగానే తనకు కడప జిల్లాలోని...