Home విశ్లేషణ Ongole RIMS: దిక్కులేని రిమ్స్.. పేదలు వెళ్తే మరణమే శరణమా..!?

Ongole RIMS: దిక్కులేని రిమ్స్.. పేదలు వెళ్తే మరణమే శరణమా..!?

Ongole RIMS: No Medicines No Treatment
Ongole RIMS: No Medicines No Treatment

Ongole RIMS: పేరు వింటే పెద్ద బ్రాండ్.. పనితీరు చూస్తే పేదలకు కూడా పని చేయదు.. దీన్నే పేరు గొప్ప ఊరు దిబ్బ అని చెప్పుకోవచ్చు..! ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి ఇదే కోవలోకి వస్తుంది. వైద్యుల నిర్లక్ష్యం.., అధికారుల పర్యవేక్షణ లోపం.. సిబ్బంది అలసత్వం.. అన్నిటికీ తోడు వసతులు లేమి, మందులు లేకపోవడం… ఇన్ని సమస్యల మధ్య పేదల ఆసుపత్రి పెద్ద జబ్బుతో కూరుకుపోయింది.. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ప్రభుత్వాసుపత్రి ఉంది, వెళ్లి రోగం నయం చేయించుకోవచ్చు అనే ధీమా ఉండడం లేదు. స్కానింగులు బయటే, పరీక్షలు బయటే, చివరికి మందులు కూడా బయట కొనుక్కోవాల్సిందే. లేకపోతే అక్కడే పడి చావాల్సిందే.. ఇదే ఒంగోలు రిమ్స్ లో దారుణ పరిస్థితి..!!

Ongole RIMS: మరణాలు బయటకు రానివి ఎన్నో..!?

కరోనా సందర్భంగా జిల్లాలో పెద్ద భరోసా ఇచ్చింది ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి మాత్రమే. వేలాది రోగులకు వైద్యం అందించింది. కానీ కొన్ని నెలల నుండి రిమ్స్ లో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. సైలెంట్ గా పాదులను దాటుతున్నాయి. మీడియా కంట పడకుండా.. లెక్కలు లేకుండా కరోనా అందరూ మర్చిపోతుండడంతో.. మరణాలు కూడా మర్చిపోవాల్సిన దుస్థితికి వచ్చేసింది.. మందులు, వైద్య సదుపాయాలూ అందుబాటులో లేక వైద్యులు కూడా ఏమి చేయలేకపోతున్నారు. కొన్ని రోజుల నుండి మరణాలు పెరుగుతున్నాయి.

Ongole RIMS: No Medicines No Treatment

కనీస మందులు లేవట..!

మోనోసెఫ్ అనేది ఒక యాంటీ బియోటెక్.. టైఫాయిడ్, ఇతర వైరల్ జ్వరాలకు వాడతారు. ఆ మందుతో మాత్రమే ప్రస్తుతం కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. Meropenem అనే ఇంజక్షన్, Piperacillin tazobactum అనే మందు లేకపోవడంతో అందుబాటులో ఉన్న మందులతో ఏదో నెట్టుకొస్తున్నారు. కరోనా బాగా ముదిరితే రక్తం గడ్డ కడుతుంది. దీని నివారణకు lupinox అనే ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో లేదు. levofuxin iv కూడా ఉండదు. కొన్ని స్టెరాయిడ్స్ ఇస్తున్నప్పటికీ దాని వలన షుగర్ పెరుగుతుంది. దీని నివారణ, నియంత్రణకు అవసరమయ్యే కిట్, కొన్ని మందులు బయట కొనుక్కుంటేనే పని.. లేకపోతే అంతే సంగతులు.. రోగి ఆసుపత్రిలో చేరిన రోజున, లేదా తర్వాత రోజున వైద్య పరీక్షలు చేస్తారు.. ఆ రిపోర్ట్ వచ్చే సరికి కనీసం వారం, పది రోజులు పడుతుంది.. ఈ లోగా ఏ రిపోర్ట్ చూసి, వైద్యం అందిస్తారో అక్కడి వైద్యులకే తెలియాలి. బయటకు చెప్పలేక, మింగలేక వైద్యులు కూడా సైలెంట్ గా ఉంటున్నారు. మెడికల్ రిపోర్ట్ త్వరగా కావాలన్నా.. మందులు కొన్ని కావాలన్నా పెద్ద స్థాయి రికమెండేషన్ ఉండాలి. లేదా చేతిలో నోట్ల కట్ట ఉండాలి.

అంతర్గత అవినీతి బోలెడు..!!

ఇక రిమ్స్ లో అంతర్గత అవినీతికి అంతే లేదు. స్కానింగ్ పరికరాలు ఉన్నప్పటికీ.. బయటకు పంపిస్తారు. మందులు ఉన్నప్పటికీ.. బయటకు కొన్ని తెచ్చుకోవాలని ఫలానా అడ్రెస్ చెప్పి పంపిస్తారు. వీటి అన్నిటికీ మించి భోజన సరఫరా అయితే నాసిరకం. ప్రభుత్వం ఇచ్చే నగదుకు, వీళ్ళు అందించే నగదుకు సంబంధం ఉండదు. అయితే రాజకీయ సిఫార్సులతో ఈ కాంట్రాక్టర్ రాజకీయ భజనలు చేసుకుంటూ.., పెదాలతో ఆడుకుంటున్నారు. కరోనా రెండోదశ కొందరు నాయకుల పేరిట ఏర్పాటైన సేవా కేంద్రాలు కూడా అనధికార స్పాన్సర్ ఈ భోజన కాంట్రాక్టర్లేనని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అలా నాయకుల ఆశీస్సులతో అవినీతి వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి..

Exit mobile version